Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కష్టపడి పనిచేస్తే బీజేపీలో గుర్తింపు లభిస్తుందనడానికి ఈ పదవే నిదర్శనం: ఎంపీ శ్రీనివాసవర్మ

Narasapuram MP Srinivasa Varma talks about minister post
Advertisement
  • నరసాపురం లోక్ సభ స్థానం నుంచి బీజేపీ తరపున గెలిచిన శ్రీనివాసవర్మ
  • వర్మకు కేంద్ర మంత్రివర్గంలో చోటు
  • కార్యకర్తగా ప్రస్థానం ఆరంభించానన్న వర్మ
Advertisement
కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి ఇవాళ కేంద్ర మంత్రిగా ఎదిగిన నరసాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ మీడియాతో మాట్లాడారు. కష్టపడి పనిచేసే వారికి బీజేపీలో గుర్తింపు లభిస్తుందనడానికి తనకు దక్కిన మంత్రి పదవే నిదర్శనమని అన్నారు. నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో తనకు కూడా స్థానం లభించడం సంతోషం కలిగిస్తోందని తెలిపారు. 

బీజేపీలో ఓ కార్యకర్తగా తన ప్రస్థానం మొదలైందని, గత 34 ఏళ్లుగా పార్టీతో నడుస్తున్నానని  శ్రీనివాసవర్మ వెల్లడించారు. నరసాపురం లోక్ సభ టికెట్ వచ్చినప్పుడు, కార్యకర్తలు గెలుపుపై తనకు భరోసా ఇచ్చారని తెలిపారు. 

తన విజయం కోసం బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నేతలు, కార్యకర్తలు కృషి చేశారని, వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వివరించారు. తనకోసం రాయలసీమ నుంచి కూడా వచ్చి ప్రచారం చేశారని తెలిపారు. తన రాజకీయ ప్రస్థానంలో ఇప్పటివరకు సహకరించి, ప్రోత్సహించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని శ్రీనివాసవర్మ పేర్కొన్నారు.
Advertisement
Advertisement
Bhupathiraju Srinivasa Varma
Minister
NDA
BJP
Narasapuram
Andhra Pradesh

More Telugu News